ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం

idigoo deevaa naa jeevitham aapaadamasthakam nee kankitham

🎵 TG-1023🌐 Telugu
పల్లవి

ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం శరణం ..........నీ చరణం........... ||ఇదిగో||

1వ చరణం

పలుమార్లు వైదొలిగినాను - పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపునకు - తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో - నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా - ఈ నా శేషజీవితం (2) ||ఇదిగో దేవా||

2వ చరణం

నీ పాదములచెంత చేరి - నీ చిత్తంబు నే నెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పని చేయనిమ్ము ఆగిపోక సాగిపోవు ప్రియ - సుతునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీసాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము (2) ||ఇదిగో దేవా||

3వ చరణం

విస్తార పంట పొలము నుండి- కష్టించి పనిచేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు - కలకాలం మరి నాకు నొసగు క్షేమ క్షామ కాలమైన నిన్ను - ఘనపరచ బ్రతుకు నిమ్మయ నశియించు ఆత్మలన్‌ నీ - దరి చేర్చ కృపనిమ్మయ (2) ||ఇదిగో దేవా||

Report Error