ఈ దినం సదా - నా యేసుకే సొంతం

ee dinam sadaa - naa yeesukee sontham

🎵 TG-1025🌐 Telugu
పల్లవి

ఈ దినం సదా - నా యేసుకే సొంతం నా నాధుని ప్రసన్నత - నాతోడ నడచును రానున్న కాలము - కలత నివ్వదు నామంచికాపరీ సదా - నన్ను నడుపును ||ఈ||

1వ చరణం

ఎడారులు లోయలు ఎదురు నిలచిన ఎన్నడెవరు నడువని బాటయైనను వెరవదెన్నడైనను నాదు హృదయము గాయపడిన యేసుపాదం అందు నడచెను ||ఈ దినం||

2వ చరణం

ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా యుద్ధకేక నా నోట యేసు నామమే విరోదమైన ఆయుధాలు యేవిఫలించవు యెహోవా నిస్సియే నాదు విజయము ||ఈ దినం||

Report Error