ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక

idee...naakoorika nava jeevana raaga maalika

🎵 TG-1022🌐 Telugu
పల్లవి

ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక (2) యేసులాగా ఉండాలని - యేసుతోనే నడవాలని (2) నిలవాలనీ గెలవాలనీ (2) యేసుతోనే ఉండి పోవాలని ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక

1వ చరణం

ఈ లోకములో పరలోకంలో - నీతోనే నివసించాలని ఇంటా బయటా యేసునాధుని - కంటి పాపనై వెలిగి పోవాలని (2) ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక ||ఇదే...నాకోరిక నవ||

2వ చరణం

యాత్రను ముగించిన వేళ - ఆరోహణమై పోవాలని (2) క్రీస్తు యేసుతో సింహాసనము - పైకెగసి కూర్చోవాలని (2) ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక ||ఇదే...నాకోరిక నవ||

Report Error