TG-3604
Telugu

కృపలను తలంచుచు

Krupalanu Thalanchuchu

0
views
పల్లవి

కృపలను తలంచుచు (2) ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ (2) ||కృపలను||

1వ చరణం

కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో (2) నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం – (యేసు) (2) ||కృపలను||

2వ చరణం

రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను (2) నాకు విరోధమై వర్ధిల్లదు యని చెప్పిన మాట సత్యం – (ప్రభువు) (2) ||కృపలను||

3వ చరణం

సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి (2) సతతము తన కృప వెల్లడిచేయ శుద్దులతో నిలిపెను – (ఇలలో) (2) ||కృపలను||

4వ చరణం

హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే (2) సీయోను నివాసం నాకెంతో ఆనందం ఆనందమానందమే – (ఆమెన్) (2) ||కృపలను||