♪♫
TG-5756
Telugu
సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని
Soodarudaa Paapakshamakai Veedumaa Prabhu Yeesuni
22
views
పల్లవి
సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు - యేసుని 1. యేసుని రాజ్యము - సమయము వచ్చెను రక్షణను పొందెదవు - నీవు విశ్వసించిన 2. మనుజరూపము ధరించి - స్వర్గము దిగి వచ్చెను తనదు రక్తముద్వారానే - పాపబంధము త్రుంచెను 3. కలువరిలోని సిలువలో - ప్రాణము నర్పించెను ఎల్లరి పాపములకై - తనదు రక్తము కార్చెను 4. సమయము లేదు సోదరా - త్వరపడి రమ్ము వేగమే సువార్తను విశ్వసించి - రక్షణను పొందుము 5. పాప సాగరమునందు ఎంతకాలముందువు? పాపసాగరమునుండి - యేసుప్రభు విడిపించును
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.