TG-5757
Telugu

సోదరులారా లెండి రాకడ గుర్తులు చూడండి

Soodarulaaraa Lendi Raakada Gurthulu Choodandi

0
views
పల్లవి

సోదరులారా లెండి - రాకడ గుర్తులు చూడండి దివిటీల నూనెతో నింపి - సిద్ధపడండి 1.  అర్ధరాత్రివేళలో - ప్రభురాకడ ధ్వని మ్రోగెను సోమరితనము విడచి (2) నడుమున దట్టి గట్టి - ప్రభుని కెదురుచూడుము 2.  సర్వత్రయుద్ధాలు భూకం-పములును ఘోరవ్యాధులు ఘోరముగ ప్రబలెను (2) యేసుని రాకడ సమీపం - బాయెనో సోదరా 3.  రాజ్యాలు అధికారాలన్ని - కదలిపోవుచున్నవి కలవర మధికంబాయె (2) కన్నులు తెరచి చూడుమా ప్రభు వచ్చేవేళాయె 4.  చెదరిన యూదులు స్వదేశానికి చేరుటే యొక సూచన క్రీస్తుయుగ మారంభము (2) రానై యున్న వేళిదే - కనిపెట్టుము సోదరా 5.  తలుపు వేయబడిన లోన - ప్రవేశించనేరవు పశ్చాత్తాప పడుము (2) యేసుపై నాధారపడి సంసిద్ధపడుమా