TG-5755
Telugu

సొంతమైపోవాలి నా యేసుకు మిళితమైపోవాలి నా ప్రియునితో

Sonthamaipoovaali Naa Yeesuku Millithamaipoovaali Naa Priyunithoo

24
views
పల్లవి

సొంతమైపోవాలి నా యేసుతో మిళితమై పోవాలి నా ప్రియునితో (2) సొంతమై మిళితమై యేసుతో ఏకమై (2) ఎగిరి వెళ్లి పోవాలి నా రాజుతో లీనమై పోవాలి ఆ ప్రేమలో (2) నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి నా వరుడు కలువరిలో బలియాయెను (2) బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము (2) ధర్మము.. ధర్మము.. యేసుతో జీవితం (2) ||సొంతమై||

1వ చరణం

పరదేశిగా నేను వచ్చానిలా తన ప్రేమ కీర్తిని చాటాలని (2) ప్రియుని కోసమే బ్రతికెదను కాపాడుకొందును సౌశీల్యము ప్రభువు కోసమే బ్రతికెదను కాపాడుకొందును నా సాక్ష్యము యేసుతో జీవితం పరమున శాశ్వతం (2) ||సొంతమై||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.