కుమ్మరి ఓ కుమ్మరి

kummari oo kummari

🎵 TG-2940💿 Andhra Zion songs book(song no. 644)Late Rev. C.A.J. Prasad Rao (AELC) · Late Rev. C.A.J. Prasad Rao (AELC)🌐 Telugu
పల్లవి

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిధారీ జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా చల్లగ చూడుమయ్యా పనికిరాని పాత్రనని – పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||

1వ చరణం

విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||

2వ చరణం

లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్ మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||

Report Error