కుతూహలం ఆర్భాటమే

kutoohalan aarbhaatamee

🎵 TG-2943🌐 Telugu
పల్లవి

కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో (2) ||కుతూహలం||

1వ చరణం

పాపమంత పోయెను –రోగమంత పోయెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో (2) ||కుతూహలం ||

2వ చరణం

దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే ఆత్మయైన దేవుడు – మన సొంతమాయెను ఆశ్చర్యమాశ్చర్యమే (2) ||కుతూహలం||

3వ చరణం

శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు జయంపై జయం ఇచ్చును ఏకముగా కూడి – హోసన్నా పాడి ఊరంతా చాటెదము (2) ||కుతూహలం||

Report Error