TG-5572
Telugu

మాధుర్యమే నా ప్రభుతో జీవితం

Maadhuryamee Naa Prabhuthoo Jeevithan

0
views
పల్లవి

మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే – మహా ఆశ్చర్యమే ||మాధుర్యమే||

1వ చరణం

సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారు వారి అందమంతయు పువ్వు వలె వాడిపోవును – వాడిపోవును ||మాధుర్యమే||

2వ చరణం

నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి భయ భక్తులతో ఉండుటే మేలు – ఉండుటే మేలు ||మాధుర్యమే||

3వ చరణం

నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువే నా రోగమంతయు సిలువలో పరిహరించెను – పరిహరించెను ||మాధుర్యమే||

4వ చరణం

వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను తేజోవాసులైన పరిశుద్ధులతో ఎపుడు చేరెదనో – ఎపుడు చేరెదనో ||మాధుర్యమే||