TG-342
Telugu

నాకై చీల్చఁబడ్డ యో నా

naakai cheelchambadda yoo naa

200
views
పల్లవి

నాకై చీల్చఁబడ్డ యో నా యనంత నగమా నిన్ను డాగి యందునఁ చెను మీరఁ బారెడు రక్త జలధారలా సక్తిఁ గ్రోలఁగా నిమ్ము.

1వ చరణం

నేను నాదు శక్తిచే నిన్నుఁ గొల్లఁజాలను కాల మెల్ల నేడ్చినన్ వేల క్రతుల్ చేసినన్ నేను చేయు పాపము నేనె బాపఁజాలను. ||నాకై చీల్చఁబడ్డ||

2వ చరణం

వట్టి చేయి చాఁచుచున్ ముట్టి సిల్వఁ జేరెదన్ దిక్కు లేని పాపిని ప్రక్కఁ జేర్చి ప్రోవుము నా కళంక మెల్లను యేసునాధ, పాపము. ||నాకై చీల్చఁబడ్డ||

3వ చరణం

ఈ ధరిత్రియందున నేఱు దాఁటునప్పుడు నాదరించి నీ కడన్ నాకై చీల్చఁబడ్డయో నా యనంత శైలమా నన్ను ఁ జేరఁ దీయుమా ||నాకై చీల్చఁబడ్డ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.