TG-3415
Telugu

గొంతు ఎత్తి చాటెదాను

Gonthu Etthi Chaatedaanu

13
views
పల్లవి

గొంతు ఎత్తి చాటెదాను నడుము కట్టి పయనింతును నా యేసు గొప్పవాడు (4) నిన్ను నన్ను ఎన్నడూ విడువలేనన్నాడు నీ కొరకే నేనన్నాడు (2) నా యేసు గొప్పవాడు (4) ||గొంతు||

1వ చరణం

ఎంత గొప్ప కార్యము చేసినాడు ఎర్ర సంద్రమునే చీల్చినాడు ఎంత గొప్ప మహిమను తెచ్చినాడు యెరికో గోడలు కూల్చినాడు (2) ఎంతాటి కార్యమైనా చేయగలడు శక్తివంతుడు అసాధ్యుడు (2) నా తండ్రి గొప్పవాడు (4) ||గొంతు||

2వ చరణం

ఎంత గొప్ప కార్యము చేసినాడు నిషేధించిన రాయి స్థానం మార్చాడు పనికిరాని పాత్రను వాడగలడు గొప్పదైన దానిగా చేయగలడు (2) ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నాడు ఎంత గొప్ప దేవుడు నా యేసుడు (2) నా యేసు గొప్పవాడు (4) ||గొంతు||

3వ చరణం

కన్న తల్లి కన్న తండ్రి చూపలేనిది నా యేసు తండ్రి చూపుతాడు ఈ లోక స్నేహం ఇవ్వలేనిది నా యేసు ప్రాణం ఇచ్చినాడు (2) ఎన్నాడు విడువని గొప్ప దేవుడు లోకమంతా విడిచినా నిన్ను విడువడు (2) నా యేసు గొప్పవాడు (4) ||గొంతు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.