♪♫
TG-3421
Telugu
గొర్రెపిల్ల జీవ గ్రంథమంద
Gorrepilla Jeeva Grandhamandu
0
views
పల్లవి
గొర్రెపిల్ల జీవ గ్రంథమందు – నీ పేరున్నదా పరలోక రాజ్య ప్రవేశము – నీకున్నదా ఏది గమ్యము ఏది మార్గము యోచించుమా ఓ క్రైస్తవా (2) ||గొర్రెపిల్ల||
1వ చరణం
ఆరాధనకు హాజరైనా కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా (2) ఎన్ని సభలకు నీవు వెళ్ళినా మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల||
2వ చరణం
సంఘములో నీవు పెద్దవైనా పాటలెన్నో నీవు పాడినా (2) వాక్యమును నీవు బోధించినా మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల||
3వ చరణం
ఉపవాసములు ఎన్ని ఉన్నా ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా (2) ప్రవచనములు నీవు ఎన్ని పలికినా మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల||