వందనము నీకే నా
Vandanamu Neeke Naa
వందనము నీకే నా వందనము (2) వర్ణనకందని నీకే నా వందనము (2) ||వందనము||
నీ ప్రేమ నేనేల మరతు నీ ప్రేమ వర్ణింతునా (2) దాని లోతు ఎత్తునే గ్రహించి (2) నీ ప్రాణ త్యాగమునే తలంచి (2) ||వందనము||
సర్వ కృపానిధి నీవే సర్వాధిపతియును నీవే (2) సంఘానికి శిరస్సు నీవే (2) నా సంగీత సాహిత్యము నీవే (2) ||వందనము||
పరిశుద్ధమైన నీ నామం పరిమళ తైలము వలె (2) పరము నుండి పోయబడి (2) పరవశించి నేను పాడెదను (2) ||వందనము||
మృతి వచ్చెనే ఒకని నుండి కృప వచ్చెనే నీలో నుండి (2) కృషి లేక నీ కృప రక్షించెను (2) కృతజ్ఞతార్పణలర్పింతును (2) ||వందనము||
తండ్రియైన దేవునికే కుమారుడైన దేవునికే (2) పరిశుద్ధాత్మ దేవునికే (2) వందన వందన వందనము (2) ||వందనము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.