♪♫
TG-4386
Telugu
వర్ణించలేను
Varninchalenu
0
views
పల్లవి
వర్ణించలేను వివరించలేను అతి శ్రేష్టమైన నీ నామమున్ యేసు నీ నామమున్ – (2) కొనియాడెదన్ కీర్తించెదన్ (2) అత్యంతమైన నీ ప్రేమను యేసు నీ ప్రేమను (2) ||వర్ణించలేను||
1వ చరణం
మహోన్నతుడ నీవే – పరిశుద్ధుడ నీవే పాపినేని చూడక ప్రేమించితివే (2) హల్లెలూయా హల్లెలూయా (2) అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను||
2వ చరణం
సర్వాధికారి సర్వోన్నతుడా (2) హీనుడైన నన్ను కరుణించితివే (2) హల్లెలూయా హల్లెలూయా (2) అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను||
3వ చరణం
రత్న వర్ణుడవు అతి సుందరుడవు (2) నీ మహిమ నాకిచ్చి వెలిగించితివే (2) హల్లెలూయా హల్లెలూయా (2) అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను||