వందనంబొనర్తుమో
Vandanambonarthumo
వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో ||వందనం||
ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి ఎపుడు గాచియు ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రములివిగో ||వందనం||
ప్రాత వత్సరంపు బాప మంతయు బ్రీతిని మన్నించి మమ్ము గావుము నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా దాత క్రీస్తు నాథ రక్షకా ||వందనం||
దేవ మాదు కాలుసేతు లెల్లను సేవకాలి తనువు దినములన్నియు నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ సేవకై యంగీకరించుమా ||వందనం||
కోతకొరకు దాసజనము నంపుము ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము ఖ్యాతి నొందు నీతి సూర్యుడా ||వందనం||
మా సభలను పెద్దజేసి పెంచుము నీ సువార్త జెప్ప శక్తి నీయుము మోసపుచ్చు నందకార మంత ద్రోయుము యేసు కృపన్ గుమ్మరించుము ||వందనం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.