TG-5220
Telugu

నా హృదయాన కొలువైన యేసయ్యా

Naa Hrudayaana Koluvaina Yeesayyaa

0
views
పల్లవి

నా హృదయాన కొలువైన - యేసయ్యా నా అణువణువు నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో - ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా 1. అగ్ని ఏడంతలై - మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే - నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారెనే - శత్రు సమూహము అల్లాడెనే నేను నీ స్వాస్థ్యమే - నీవు నా సొంతమే నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా ||నా హృదయాన||

1వ చరణం

2. అంతా వ్యర్థమని - వ్యర్థులైరెందరో నా గురి నీపై నిల్పినందుకే నా పరుగు సార్థకమాయెనే నీయందు పడిన ప్రయాసము - శాశ్వత కృపగా నాయందు నిలిచెనే నీపై విశ్వాసమే - నన్ను బలపరచెనే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును ||నా హృదయాన||

2వ చరణం

3. విత్తినది ఒకరు నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవ్వరైననూ - వృద్ధిచేసింది నీవే కదా సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే నీ ఉపదేశమే - నన్ను స్థిరపరచెనే నా సర్వము నీకే అర్పింతును ||నా హృదయాన||