TG-5146
Telugu

నా కొఱకుఁ చనిపోయి నాఁడ

Naa Korakun Chanipooyi Naanda

0
views
పల్లవి

నా కొఱకుఁ చనిపోయి నాఁడ ఆద యాకరుండిరు వంక దొంగలతోడ ||నా కొఱకు||

1వ చరణం

1.  ఆలకింపగను మనసార నాకు నానదే యా దయామృత సారధార భూలోకమునఁదనివిఁ దీర నిట్టి పుణ్యాత్ము నేమఱక పూజింతు మీర ||నా కొఱకు||

2వ చరణం

2.  కన్న తలిదండ్రులకు నైన యింత ఘన వత్సలత నేఁ గల్గుటంగాన విన్నదియులేదు చెవులూన స్వామి విక్రయంబై కొర్త వేదనలతోను ||నా కొఱకు||

3వ చరణం

3.  కీటకమువంటి ననుఁ బ్రోవ సొంత కీలాలమర్పించి ఖేదపడిచావ వాటమా తన కిటులఁ గావ నేను వర్ణింపఁ గన్నీరు వరదలైపోవ ||నా కొఱకు||

4వ చరణం

4.  ఘోరముగ నినుపమేకులను గ్రుచ్చి కొంకకానిర్దయుల్ గొల్గొతా మనలను మారణంబగు నవస్థలను బెట్ట మాదృశాత్మన్గావ మౌనమైయిలను ||నా కొఱకు||

5వ చరణం

5.  ఏమి బహుమతుల నర్పింతు నట్టి స్వామిమేళ్లల్ల నా స్వాంతమున నుంతున్ ప్రేమ భావమున వర్తింతున్ నిత్య కామితార్థం బిడు కర్తను భజింతున్ ||నా కొఱకు||

6వ చరణం

6.  చేయనిఁక పాప సంగతము నాఁడు సిలువపైఁ జచ్చిన శ్రీకరుని కతము పాయ కాబ్రభుసత్యవ్రతము నాధు ప్రాణాంత మౌదాఁక ప్రార్థింతు సతము ||నా కొఱకు||