♪♫
TG-3755
Telugu
నా నాథుడా
Naa Naathudaa
0
views
పల్లవి
నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు (2) అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని (2) పెన్నుగ నాలో నాటుమా (2) ప్రేమన్ ||నా నాథుడా||
1వ చరణం
దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్ (2) యావత్తు పెంటయనుచు (2) నిదిగో ||నా నాథుడా||
2వ చరణం
ఆదియంత రహితుడ – ఆత్మల నాయకుడా (2) ఆశ కల్గించు నాలోన (2) నీవే ||నా నాథుడా||
3వ చరణం
పరిశుద్ధ యవతరుడా – మరియు తేనె అమృతుడా (2) కరుణతో నన్ను గావుమా (2) యిప్పుడు ||నా నాథుడా||
4వ చరణం
భూతలమునకు వేంచేసి – పాతకుల ప్రేమించితివి (2) పాతకుడ నేనైతిని (2) మహా ||నా నాథుడా||
5వ చరణం
ఆద్యంతము లేనట్టి – బీదలకు ధన నిధీ (2) సదయుడా నన్ను చూడుమా (2) యిపుడు ||నా నాథుడా||
6వ చరణం
హల్లెలూయ గీతమును – ఎల్లెడల చాటించెదను (2) ఉల్లమందానంద ధ్వని (2) యిదియే ||నా నాథుడా||