TG-4476
Telugu

యేసే నా ఆశ్రయము

Yese Naa Aashrayamu

21
views
పల్లవి

యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము నా కోట నీవే… నా దుర్గము నీవే నా కాపరి నీవే (2) శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా కష్టాల ఊభిలో కూరుకున్ననూ (2) నన్ను లేవనెత్తును నన్ను బలపరచును నాకు శక్తినిచ్చి నడిపించును (2) ||యేసే నా||

1వ చరణం

జీవ నావలో తుఫాను చెలరేగినా ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2) నాకు తోడైయుండును నన్ను దరి చేర్చును చుక్కాని అయి దారిచుపును (2) ||యేసే నా||

2వ చరణం

దినమంతయు చీకటి అలుముకున్ననూ బ్రతుకే భారమైన సంద్రమైననూ (2) నాకు వెలుగిచ్చిను నన్ను వెలుగించును నా నావలో నాతో నుండును (2) ||యేసే నా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.