TG-448
Telugu

కొనుము మా హృదయంబు లను

konumu maa hrudayanbu lanu

198
views
పల్లవి

కొనుము మా హృదయంబు లను నీకర్పించెద మనయము నుతి యించుచు ఘనముగాఁ గృపచేత మముఁ గా చినను మే మెంతయు ననర్హుల మనుచు నీ పాదముల కెరగుచు ననిశమును నీ కృపఁ దలంతుము ||కొనుము మా||

1వ చరణం

బలహీనులము మేము బలవంతుఁడవు నీవు బల మిచ్చి మము నడుపుము ఇలను మే మిఁక బ్రతుకు దివనం బులను నీ పద భక్తిచే నెపుడలయ కుండగ మమ్ముఁ గడు ని ర్మలిన హృదయులఁ జేసి కరుణను ||కొనుము మా||

2వ చరణం

ఘోరారణ్యము భువి వి చార సంకలితము భూరి భయంకరము దారి లేదిఁక నీవు దప్ప వేరె సాధన మెచెటఁ గానము కోరి మము నందరిని నీదరి జేరుకొను మార్గమును జూపు ||కొనుము మా||

3వ చరణం

గత వత్సరమున నీ యతులమౌ కృపచేత పతితుల మముఁ గాచితి వతి వినమ్రుల మగుచు మామా మతులలో నీ ప్రేమఁ దలఁచుచు మతి విహీనతే వీడి యిఁక నిను సతతతము సేవింతు మయ్య ||కొనుము మా||

4వ చరణం

ఈ వత్సరంబున నెవ్వరు మాలోన పోవుదు రిలను విడిచి దేవ వారలు భువిని వదలి పోవు కాలమునందుఁ దిన్నని త్రోవలో వారలను సుఖముగఁ బ్రోవఁ దొడ్కొని పోవు మయ్య ||కొనుము మా||

5వ చరణం

మమ్మును విశ్వాస మార్గమందున దోడ నిమ్ముగఁ గొని పోవుచు నమ్ము నీ ప్రియ సేవకుల బృం దమ్మునకు సిద్ధంబులగు మకు టమ్ములను మే మొందుటకు వే గమ్ముగాఁ బాత్రులను జేసి ||కొనుము మా||

6వ చరణం

శోధనల యందున బాధల యందున నోదార్పు మా కొసఁగుము శోధనలచే మాకు మరియును శుద్ధమగు హృదయంబు లిచ్చుచు శోధనల్ ఫలియిపంఁ జేయుము బాధకమ్ములు గాక యుండఁ ||కొనుము మా||

7వ చరణం

ఈ లోక దుఃఖము లెల్ల నేగిన పిదప నీ లోకమును జేరఁగఁ పాలుమాలక మేము మామా పరుగు నెత్తఁగు సాయ మిమ్మో యేలికా నీ కరములను మ మ్మెపుడు గొని నడువంగ నేర్పు ||కొనుము మా||

8వ చరణం

దురితంబు లెల్లను గరుణచేఁ గడిగి నీ పరమందు మము జేర్పుము నిరతమును మే మచట నీ కృప విరివి నెంతయు బొగడుచును మా కరములను బంగారు వీణెల వెరవుగాఁ గొని మీటుచుందుము ||కొనుము మా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.