TG-3772
Telugu

నా ప్రియుడు యేసు

Naa Priyudu Yesu

0
views
పల్లవి

నా ప్రియుడు యేసు – నా ప్రియుడు యేసు వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిల (2) ||నా ప్రియుడు||

1వ చరణం

మెల్లని చల్లని స్వరమే వినబడెను (2) తండ్రీ వీరేమి చేయుచున్నారో (2) ఎరుగరు గనుక క్షమించుమనెన్ ఆ ప్రియ స్వరమే నా ప్రభు స్వరమే ||నా ప్రియుడు||

2వ చరణం

అతని ప్రేమ మధురం మధురం ఎన్నటికీ నే మరువలేను (2) ధారబోసెను జీవం – నాకిచ్చె నిత్య జీవం శాపమంతా బాపి నను దీవించెనుగా ||నా ప్రియుడు||

3వ చరణం

వీపంతా దున్నబడె నాగలితో కారె రక్త వరదల్ కనుమా (2) యేసు రక్తంలో రక్షణ – యేసు రక్తంలో స్వస్థత నాకై మరణించి తిరిగి లేచె సజీవునిగా ||నా ప్రియుడు||

4వ చరణం

తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి నాకై విన్నతి చేయుచున్నాడు (2) రానైయున్నాడు వేగ – మేఘముపై విభుడే నన్ను పరమ గృహమునకు తోడ్కొని వెళ్ళును ||నా ప్రియుడు||