TG-5257
Telugu

నాధ యేసు నాధ క్రీస్తు నాధ నేననాధ

Naadha Yeesu Naadha Kreesthu Naadha Neenanaadha

0
views
పల్లవి

నాధ యేసు నాధ క్రీస్తు నాధ నేననాధ సాధు జనులఁ బ్రోచు సదయు నీ దయ కాదా ||నాధ||

1వ చరణం

1.  గతిఁ దలఁపని మూర్ఖచిత్త గమనుఁడనే గానా సతతముననుఁ గరుణఁ బ్రోచెడు గతియ నీవు కావా ||నాధ||

2వ చరణం

2.  పాపమందు జననమైన పామరుండ నేఁగానా కటకట ననుఁ గని కరించు కరుణ నీది గాదా ||నాధ||

3వ చరణం

3.  కుటిల బుద్ధిగల వాఁడను క్రూరుఁడ నేఎఁగానా కటకట ననుఁ గని కరించు కరుణ నీది గాదా ||నాధ||

4వ చరణం

4.  ఆది కర్త వీవు గావె యఖిల లోకమునకును బీదవారి నెల్లఁ బ్రోచు బిరిదు నీది గాదా ||నాధ||

5వ చరణం

5.  సారమైన సత్యశాస్త్ర సార మీవు గావా ఘోరమైన పాపి జనులఁ గోరి పిలువ లేదా ||నాధ||

6వ చరణం

6.  జీవ నాధారమైన త్రోవ నీవు గావా దేవదేవ యెహవా నా దిక్కు నీవు గావా ||నాధ||