ఆనందము ప్రభు నాకొసగెను నా

aanandamu prabhu naakosagenu naa

🎵 TG-1653🌐 Telugu
పల్లవి

ఆనందము ప్రభు నాకొసగెను నా జీవితమే మారెను (2) నా యుల్లమందు యేసు వచ్చెన్ నా జీవిత రాజాయెను (2)         ||ఆనందము||

1వ చరణం

ప్రభుని రుచించి ఎరిగితిని ఎంతో ఎంతో ప్రేమాముర్తి విశ్వమంతట నే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను (2)      ||ఆనందము||

2వ చరణం

సంతోషం సముద్రపు అలలన్ పోలి పైకి ఉప్పొంగి ఎగయుచుండె నన్ను పిలిచి ఎన్నో మేలులు చేసే నూతన జీవమొసగెన్ (2)       ||ఆనందము||

3వ చరణం

శత్రువున్ ఎదిరించి పోరాడెదన్ విజయము పొంద బలమొందెదన్ ప్రభువుతో లోకమున్ జయించెదన్ ఆయనతో జీవించెదన్ (2)    ||ఆనందము||

Report Error