♪♫
TG-3799
Telugu
నాకు జీవమై ఉన్న
Naaku Jeevamai Unna
0
views
పల్లవి
నాకు జీవమై ఉన్న నా జీవమా నాకు ప్రాణమై ఉన్న నా ప్రాణమా నాకు బలమై ఉన్న నా బలమా నాకు సర్వమై ఉన్న నా సర్వమా నీ నామమే పాడెదన్ నా జీవిత కాలమంతా నీ ధ్యానమే చేసెద నా ఊపిరి ఉన్నంత వరకు ||నాకు జీవమై||
1వ చరణం
పూజ్యుడవు… ఉన్నత దేవుడవు యోగ్యుడవు… పరిశుద్ధ రాజువు (2) నా ఆరాధన నా ఆలాపన నా స్తుతి కీర్తన నీవే నా ఆలోచన నా ఆకర్షణ నా స్తోత్రార్పణ నీకే ||నాకు జీవమై||
2వ చరణం
నాయకుడా… నా మంచి స్నేహితుడా రక్షకుడా… నా ప్రాణ నాథుడా (2) నా ఆనందము నా ఆలంబన నా అతిశయము నీవే నా ఆదరణ నా ఆశ్రయము నా పోషకుడవు నీవే ||నాకు జీవమై||