TG-3814
Telugu

నడిపిస్తాడు నా దేవుడు

Nadipisthaadu Naa Devudu

0
views
పల్లవి

నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు (2) అడుగులు తడబడినా – అలసట పైబడినా (2) చేయి పట్టి వెన్నుతట్టి – చక్కని ఆలొచన చెప్పి (2) ||నడిపిస్తాడు||

1వ చరణం

అంధకారమే దారి మూసినా – నిందలే నను కృంగదీసినా (2) తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు||

2వ చరణం

కష్టాల కొలిమి కాల్చివేసినా – శోకాలు గుండెను చీల్చివేసినా (2) తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు||

3వ చరణం

నాకున్న కలిమి కరిగిపోయిన – నాకున్న బలిమి తరిగిపోయిన (2) తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు||