TG-3878
Telugu

నీ కృపను గూర్చి

Nee Krupanu Goorchi

20
views
పల్లవి

నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా (2) నిత్యము నే పాడెదా నా ప్రభుని కొనియాడెదా (2) మహిమా ఘనతా ప్రభావము చెల్లించెదా (2) ||నీ కృపను||

1వ చరణం

ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా నిందలో అపనిందలో నాకు తోడు నీడగా (2) నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా భయమా దిగులా మనసా నీకేలా (2) ||నీ కృపను||

2వ చరణం

వాక్యమై వాగ్ధానమై నా కొరకై ఉదయించినా మరణమే బాలియాగమై నన్ను విడిపించినా (2) నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా భయమా దిగులా మనసా నీకేలా (2) ||నీ కృపను||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.