TG-3879
Telugu

నీ నామం అతి మధుర

Nee Naamam Athi Madhuram

21
views
పల్లవి

నీ నామం అతి మధురం నీ గానం నే చేసెదను (2) నిన్నా నేడు నిరతం ఏకరీతిగ ఉన్న నామము ఎన్ని తరములైనా మార్పుచెందని ఘన నామము (2) మహోన్నతమైనది యేసు నీ నామము కీర్తింపతగినది సాటిలేని నీ నామం ||నీ నామం||

1వ చరణం

ఆదరించే నామం – ఆశ్రయంబగు నామం ఆలకించే నామం – ఆత్మతో నడిపే నామం (2) అన్ని నామములకు పైన నామం ఉన్నతంబగు నీ నామం ||నీ నామం||

2వ చరణం

జాలి గలిగిన నామం – జాగు చేయని నామం జవాబు నొసగే నామం – జయమునిచ్చే నామం (2) జుంటె తేనె కన్న మధురం జీవ జలమగు నీ నామం ||నీ నామం||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.