♪♫
TG-3897
Telugu
నీ ప్రియ ప్రభుని సేవకై
Nee Priya Prabhuni Sevakai
0
views
పల్లవి
నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవే పవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే (2) అంధకార జీవితమునకు – వెలుగు తెచ్చెను తానే (2) ఆ వెలుగు ద్వారానే – నూతన మార్గము కలిగె (2) సజీవ బలిగా నర్పించు – నీ జీవితమాయనకే (2) ||నీ ప్రియ||
1వ చరణం
తప్పిపోతివి గతమందు – తప్పు దారిని నడిచితివి (2) తన ప్రేమా హస్తమే – నిన్ను కాపాడి తెచ్చెను (2) యెంతైన స్మరియించు నీవు – వింతైన తన ప్రేమన్ (2) ||నీ ప్రియ||
2వ చరణం
ఓ ప్రియుడా తలచితివా – నీ జన్మమే పాపమని (2) ప్రభువే తన రక్తముతో – నీ పాపము క్షమియించె (2) నీ యుల్లము ఆయన కాలయమే – జ్ఞాపకముంచుకొనుము (2) ||నీ ప్రియ||
3వ చరణం
యెవరతని సేవించెదరో – ఫలమొందెదరంతమందు (2) ఇతరులకు లేనట్టి – ఆ ఘనతను నీ కిచ్చె (2) కృతజ్ఞుడవై కొనియాడు – ప్రభు పాద సన్నిధిని (2) ||నీ ప్రియ||