TG-2818
Telugu

సాగేటి ఈ జీవ యాత్రలో

saageeti ee jeeva yaathraloo

58
views
పల్లవి

సాగేటి ఈ జీవ యాత్రలో రేగేను పెను తుఫానులెన్నో (2) ఆదరించవా నీ జీవ వాక్కుతో సేదదీర్చవా నీ చేతి స్పర్శతో యేసయ్యా.. ఓ మెసయ్యా హల్లెలూయా నీకే స్తోత్రమయా (2) ||సాగేటి||

1వ చరణం

సుడి గాలులెన్నో లోక సాగరాన వడిగా నను లాగి పడద్రోసే సమయాన నడిపించగలిగిన నా చుక్కాని నీవే విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే (2) ||యేసయ్యా||

2వ చరణం

వడ గాటులెన్నో నా పయనములోన నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన తడబాటును సరి చేసే ప్రేమ మూర్తి నీవే కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే అలల శ్రమలెన్నో బ్రతుకు నావపైన చెలరేగి విలవిలలాడించే సమయాన నిలబెట్టి బలపరిచే బలవంతుడ నీవే కలవరమును తొలగించే కన్న తండ్రి నీవే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.