TG-3924
Telugu

నీకు సాటి ఎవరు లేరు

Neeku Saati Evaru Leru

0
views
పల్లవి

నీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా) ఇలలో నీవే ఏకైక దేవుడవు (2) ఆత్మతో సత్యముతో ఆరాధింతును నీదు క్రియలు కొనియాడెదను (2) అత్యున్నతుడా నా యేసయ్యా నీవే నాకు నిజ రక్షకుడవు (2) ||నీకు||

1వ చరణం

పరమందు దూతలు నిను పొగడుచుందురు నీవే ప్రభువుల ప్రభువని (2) నీ ఘన కీర్తిని వివరించగలనా నా ప్రియుడా నా యేసయ్యా (2) ||అత్యున్నతుడా||

2వ చరణం

ఆకాశమనాడు ఆసీనుడైనవాడా నీ తట్టు కన్నులెత్తుచున్నాను (2) ఊహించువాటి కంటే అత్యధికముగా దయచేయువాడవు నీకే స్తోత్రం (2) ||అత్యున్నతుడా||