TG-3983
Telugu

నేనునూ నా ఇంటి వారును

Nenunu Naa Inti Vaarunu

0
views
పల్లవి

నేనునూ నా ఇంటి వారును యెహోవాను సేవించెదము ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని (2) సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని ||నేనునూ||

1వ చరణం

శ్రమలో శోధనలో మరణ బంధకంలో శాంతి సమాధానం దయచేసి దేవుడు (2) ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో (2) ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు (2) ||నేనునూ||

2వ చరణం

ఏ పాపము నన్ను ఏలనీయని వాడు ఏ అపాయమును రాకుండా కాపాడును (2) కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు (2) నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు (2) ||నేనునూ||

3వ చరణం

దీర్ఘాయువు చేత దీవించు దేవుడు దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును (2) మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు (2) మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును (2) ||నేనునూ||