మోకాళ్ళ అనుభవము
Mokaalla Anubhavamu
మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా విసుగక ప్రార్ధించే మనసు ఉన్నదా (2) వెలిగే దీపానికి నూనె అవసరం నీ ఆత్మా దీపానికి ప్రార్ధనవసరం (2) నూనె లేని దీపము ఆరిపోవును ప్రార్ధించలేని జీవితము పతనమవ్వును (2) ||మోకాళ్ళ||
శోధనలో పడకుండా ప్రార్ధించుము శోధన తప్పించుటకు ప్రార్ధించుము (2) కన్నీటితో ప్రార్ధించిన హిజ్కియాను చూడుము (2) మరణము తప్పించబడి ఆయుష్షు నొందెను (2) ||మోకాళ్ళ||
ప్రతి నిమిషమందు మనము ప్రార్ధించగలిగినా పరలోక సంతోషం దేవుడిచ్చును (2) పట్టుదలతో ప్రార్ధించిన ఏలీయాను చూడుము (2) ఆకాశ జలములను మూసివేసెను (2) ||మోకాళ్ళ||
అడుగుడి మీకివ్వబడును తట్టుడి మీకు తీయబడును అన్నాడు మన యేసు అడిగి చూడుము (2) సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు (2) అడిగిన వారందరికి తప్పక దయచేయును (2) ||మోకాళ్ళ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.