TG-3708
Telugu

మూడు దశాబ్దాల

Moodu Dashaabdaala

0
views
పల్లవి

మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని దీవించిన దేవా నీకు వందనం (2) వందనం వందనం… వందనం నీకే మా వందనం (2) దేవా ||మూడు దశాబ్దాల||

1వ చరణం

పాపులమైన మమ్మును వెదకి రక్షించినందుకు ఏమియు లేని మాకు అన్నిటిని నొసగినందుకు (2) ||వందనం||

2వ చరణం

బలవంతులుగా చేసి మూడు బాణాలను ఇచ్చినందుకు మా భోజనపు బల్ల చుట్టు ఒలీవ మొక్కల వలె పెంచినందుకు (2) ||వందనం||

3వ చరణం

మా కష్టాలలో, దుఃఖాలలో మమ్ము కాచిన దేవా మా వ్యాధులను, బాధలను తీర్చిన దేవా (2) ||వందనం||