TG-3704
Telugu

మేలులు నీ మేలులు

meelulu nee meelulu

19
views
పల్లవి

మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2) నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా ||మేలులు||

1వ చరణం

కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2) నీది గొర్రెపిల్ల మనస్సయ్యా యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా – (3)

2వ చరణం

అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2) నీది పావురము మనస్సయ్యా యేసయ్యా.. పావురము మనస్సయ్యా – (3)

3వ చరణం

చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2) నీది ప్రేమించే మనస్సయ్యా యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా – (3)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.