మేము భయపడము
Memu Bhayapadamu
మేము భయపడము – ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు (2) ||మేము||
దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించే (2) దీవారాత్రులు దేవుడే కాయును ||మేము||
శత్రు కోటి మమ్ము జుట్టన్ పాతాళము మ్రింగ జూడన్ (2) నిత్యుడు యేసు నిత్యము కాయును ||మేము||
అగ్ని పరీక్షల యందు వాగ్ధానమిచ్చె మాతో నుండ (2) ఏ ఘడియైనను విడువక కాయును ||మేము||
బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము జుట్టి (2) పలు విధములుగా కాపాడు మమ్ము ||మేము||
కునుకడు మన దేవుడు యెన్నడు నిద్రించడు (2) కను పాపగా మము కాపాడునెప్పుడు ||మేము||
జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపరచ (2) దేవుడొసంగిన ఈవుల నెంచుచు ||మేము||
ఇహమందు మన శ్రమలన్ని మహిమకు మార్చెడు ప్రభున్ (2) మహిమపరచి మ్రొక్కెదములలో ||మేము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.