TG-5323
Telugu

నుతి సేయను లేవే యో మనసా

Nuthi Seeyanu Leevee Yoo Manasaa

0
views
పల్లవి

నుతి సేయను లేవే యో మనసా నుతిఁజేయను లేవే క్షితిని దివిని హితమతిఁ బ్రోచెడి సుతుని జనకుని శుద్ధాత్మునిఁ ద్ర్యేకుని ||నుతి||

1వ చరణం

1.  సూర్యుని కాంతి సొంపగు పంటలు సుకాలక్షేమముల్ శోభిలు గేహమున్ ఆర్య సాంగత్యము నైశ్వర్యముల నిల ననుభవింపవె నీవా యాఢ్యుని పేర్మిని ||నుతి||

2వ చరణం

2.  దురితము లందె దుర్గతి నున్న నీ కురుతర ప్రేమను బరమార్థ మీయను వరపుత్రు నొసఁగఁడె వందనీయుఁడు ప్రభు మరిమరి మ్రొక్కు మా పరమోపకారిని ||నుతి||

3వ చరణం

3.  జీవము జ్ఞానము జీవము నొసంగెడు పావనాత్మను నీకై పంపిన దేవుడు కేవల దోష స్వ భావము మార్చఁడె సేవ జేయుమ నీవా పావనమూర్తికి ||నుతి||

4వ చరణం

4.  కరములు పదముల్ కనకాదు లన్నియు స్వరమును చిత్తము స్థిరమగు ప్రేమయు మరి నీదు హృదయము పరమాత్ము సేవకై పరిపూర్ణముగ నిచ్చి ప్రణుతించు మాయనన్ ||నుతి||