TG-1504
Telugu

తలవంచకు నేస్తమా (2) తలవంచకు

thalavanchaku neesthamaa (2) thalavanchaku

58
views
పల్లవి

తలవంచకు నేస్తమా (2) తలవంచకు ఎప్పుడూ తలవంచకు ఎన్నడూ స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో కుడి ఎడమలకు బేధం తెలియని లోకంలో కన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలో ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో నీవు కావాలి ఓ.. మాదిరి నీవు ఇవ్వాలి ఓ.. ప్రేరణ నీవు మండాలి ఓ.. జ్వాలగా నీవు చేరాలి ఓ.. గమ్యము ||తలవంచకు||

1వ చరణం

చీకటిని వెనుకకు త్రోసి – సాగిపో ముందుకే క్రీస్తు బాటలో పయనిస్తే – ఎదురేమున్నది రేపటి భయం నిందల భారం – ఇకపై లేవులే క్రీస్తుని చేరు లోకాన్ని వీడు – విజయం నీదేలే (2) ||నీవు||

2వ చరణం

పెకిలించు కొండలను – విశ్వాస బాటలో గెలవాలి యుద్ధ రంగంలో – దైవిక బలంతో యేసుని కృప నీతోనే ఉంది – సాధించు ప్రగతిని మంచిని పెంచు ప్రేమను పంచు – నిలిచిపో జగతిలో

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.