♪♫
TG-3103
Telugu
ఏ యోగ్యతా లేని నన్
Ae Yogyathaa Leni Nannu
0
views
పల్లవి
ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా ఏ అర్హతా లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా నీకేమి చెల్లింతును నీ ఋణమెలా తీర్తును (2) ||ఏ యోగ్యతా||
1వ చరణం
కలుషితుడైన పాపాత్ముడను నిష్కళంకముగా నను మార్చుటకు (2) పావన దేహంలో గాయాలు పొంది (2) రక్తమంత చిందించినావా ||నీకేమి||
2వ చరణం
సుందరమైన నీ రూపమును మంటివాడనైన నాకీయుటకు (2) వస్త్రహీనుడుగా సిలువలో వ్రేళాడి (2) నీ సొగసును కోల్పోయినావా ||నీకేమి||
3వ చరణం
పాపము వలన మృతినొందిన అపరాధినైన నను లేపుటకు (2) నా స్థానమందు నా శిక్ష భరించి (2) మరణించి తిరిగి లేచావా ||నీకేమి||