హృదయమనెడు తలుపు నొద్ద యేసు

hrudayamanedu thalupu nodda yeesu

🎵 TG-310💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాధుండు నిలచి సదయుఁ డగుచుఁ దట్టుచుండు సకల విధములను ||హృదయమనెడు తలుపు||

1వ చరణం

పరుని బోలి నిలుచున్నాఁడు పరికించి చూడ నతఁడు పరుఁడు గాఁ డు రక్షకుండు ప్రాణ స్నేహితుఁడు ||హృదయమనెడు తలుపు||

2వ చరణం

కరుణాశీలుం డతఁడు గానఁ గాచి యున్నాఁడు యేసు కరుణ నెఱి గి గారవింపఁ గరము న్యాయంబు ||హృదయమనెడు తలుపు||

3వ చరణం

ఎంత సేపు నిలువఁ బెట్టి యేడ్పింతు రతని నాతఁ డెంతో దయచే బిలుచుచున్నాఁ డిప్పుడు మిమ్ములను ||హృదయమనెడు తలుపు||

4వ చరణం

అతఁడు మిత్రుఁడతఁడు మిత్రుం డఖిల పాపులకు మిర లతని పిలుపు వింటి రేని యతఁడు ప్రియుఁడగును ||హృదయమనెడు తలుపు||

5వ చరణం

జాలిచేతఁ దన హస్తములఁ జాఁపి యున్నాఁడు మిమ్ము నాలిం గనము సేయఁ గోరి యనిశము కనిపెట్టు ||హృదయమనెడు తలుపు||

6వ చరణం

సాటిలేని దయగల వాఁడు సర్వేశు సుతుఁడు తన మాట వినెడు వారల నెల్ల సూటిగ రక్షించు ||హృదయమనెడు తలుపు||

7వ చరణం

చేర్చుకొనుఁడి మీ హృదయమున శ్రీ యేసునాధు నతఁడు చేర్చు కొనుచు మీ కిచ్చును చిర జీవముఁ గృపను ||హృదయమనెడు తలుపు||

8వ చరణం

అతఁడు తప్పక కలుగఁజేయు నఖిల భాగ్యములు మీర లతని హత్తుకొందు రప్పు డానందముతోడ ||హృదయమనెడు తలుపు||

9వ చరణం

బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడఁ గాన బ్రతికి యుండు కాలముననే ప్రభుని గొలువండి ||హృదయమనెడు తలుపు||

Report Error