TG-5456
Telugu

పరిమపురి కల్పభూజ నిరత భూనరుల పూజ

Parimapuri Kalpabhooja Niratha Bhoonarula Pooja

0
views
పల్లవి

పరిమపురి కల్పభూజ నిరత భూనరుల పూజ యురుతరచిత మహిమతేజ వరస్తుతి సల్పెదము రాజ 1.  జనక సుత శుద్ధాత్మ యను పేరిట యేకాత్మ ఘనతర సంరక్ష ప్రేమ ననిపి మము కనికరించు ||పరమ||

1వ చరణం

2.  నీవే మా ప్రాపువంచు నెరనమ్మి యందు మంచు భావంబున దలఁచు వారిఁ బావనులఁ జేయు సదా ||పరమ||

2వ చరణం

3.  కలుషంబులను హరింప నిల సైతానును జయింప బలుమారు నిను దలంచు బలము గల ప్రభుఁడ వీవే ||పరమ||

3వ చరణం

4.  ఈ లోక పాపనరులు చాల నిను నమ్మి మరల దూలిచే దారుణ సై తానును బడఁద్రొక్కివేయు ||పరమ||

4వ చరణం

5.  అల్పా ఓ మేగయును నాద్యంతంబులును కల్పాంత స్థాయువైన కర్తా కరుణించు మమును ||పరమ||