♪♫
TG-3903
Telugu
నీ సాక్ష్యము ఏది
Nee Saakshyamu Edi
0
views
పల్లవి
నీ సాక్ష్యము ఏది నీ బలియర్పణ ఏది (2) ప్రభు యేసునంగీకరించి – నిద్రించెదవేల ప్రభు యేసునంగీకరించి – జాగు చేసెదవేళ మేల్కో లెమ్ము (2) రారమ్ము విశ్వాసి ||నీ సాక్ష్యము||
1వ చరణం
అపోస్తుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో (2) అన్నింటి సహించుచు (2) ఆత్మలాదాయము చేసిరి ||నీ సాక్ష్యము||
2వ చరణం
కొరడాతో కొట్టబడిరి చెరసాలయందుంచబడిరి (2) చెరసాల సంకెళ్లును (2) వారినాటంక పరచలేదు ||నీ సాక్ష్యము||
3వ చరణం
కోత విస్తారమెంతో కోత కోయువారు కొందరే (2) యేసు నిన్ పిలచుచుండే (2) త్రోసివేసెదవా ప్రభు పిలుపును ||నీ సాక్ష్యము||