♪♫
TG-3901
Telugu
నీ రూపం నాలోన
Nee Roopam Naalona
0
views
పల్లవి
నీ రూపం నాలోన – ప్రతిబింబమై వెలుగనీ నీ ప్రేమా నీ కరుణా – నా హృదిలోన ప్రవహించనీ (2) రాజువు నీవే కదా – నీ దాసుడ నేనే కదా (2) ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2) నీ రూపము నాలో ముద్రించనీ (2) ||నీ రూపం||
1వ చరణం
నా ముందు నీవు ఎడారులన్ని నీటి ఊటలుగా మార్చెదవే (2) దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2) ఆశీర్వాదము నీవే రాజా (2) ||నీ రూపం||
2వ చరణం
నా పాప స్వభావం తొలగించుమయ్యా నీ మంచి ప్రేమ నాకీయుమా (2) నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి (2) హృదయాసీనుడా నా యేసయ్యా (2) ||నీ రూపం||
3వ చరణం
అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే (2) భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే (2) భుజమును తట్టి నడిపెదవే (2) ||నీ రూపం||