TG-390
Telugu

సందియము వీడవే నా మనసా

sandiyamu veedavee naa manasaa

207
views
పల్లవి

సందియము వీడవే నా మనసా యా నందమున గూడవే సందియము లింకేల నిను సుఖ మొందఁ జేసెడు క్రీస్తు రక్తపు బిందువులు శుభవార్తవాక్యము లందుఁ గని తెలి వొంది బ్రతుకుచు ||సందియము వీడవే||

1వ చరణం

చింత లిఁక మానుము లోకులు దెల్పు భ్రాంతుల్ బడఁ బోకుము ఎంత వింత దురంత పాపము లంతటను దన రక్తమున గో రంత లేకయె దుడుచు నని సి ద్ధాంత మగు ప్రభు వాక్యమును విని ||సందియము వీడవే||

2వ చరణం

పాపములు వీడుము నీ విఁకఁ బశ్చా త్తాపమున గూడుము ఏపు మీరిన యోర్పుతో నొక పాపి కైన లయంబుఁ గోరక పాపులందఱు దిరిగి వచ్చెడు కోపుఁ గోరెడు కర్త దరిఁ జని ||సందియము వీడవే||

3వ చరణం

నేరముల నెంచుకో యేసుని కరుణా సారముఁ దలంచుకో భార ముల్ మోయుచు శ్రమన్ బడు వార లందఱు నమ్మి నా దరిఁ జేర విశ్రమ మిత్తునను ప్రభు సార వాక్కెలు చక్కఁగా విని ||సందియము వీడవే||

4వ చరణం

నిమ్మళము నొందుము రక్షకుని పలుకు నమ్ముకొని యుండుము ఇమ్మహిని బాపులకు నై ప క్షమ్ము జేసి పరాత్పరుని సము ఖమ్మునందుఁ చిత్తమ్ముగాఁ కాయమ్ము బలియుడు నీప్రభునిఁ గని ||సందియము వీడవే||

5వ చరణం

ప్రేమ దయా శాంతముల్ కర్తకు భూషా స్తోమము లవంతముల్ నీ మొఱ ల్విని యేసునాధ స్వామి తన రక్తమున బాపముఁ దోమి ని న్నకళంకుఁ జేయును నీ మదిన్ దగ నమ్ముకొన యిఁక ||సందియము వీడవే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.