TG-5468
Telugu

పరిశుద్ధాత్మను గోరుము జీవము యేసు ప్రభుని పేరట వేడుము

Parishuddhaathmanu Goorumu Jeevamu Yeesu Prabhuni Peerata Veedumu

0
views
పల్లవి

పరిశుద్ధాత్మను గోరుము జీవము యేసు ప్రభుని పేరట వేడుము నరు లందరి మీఁద నా యాత్మ నుంతు నని పరలోకపు తండ్రి పలికె వేదమునందు ||పరిశుద్ధాత్మను||

1వ చరణం

1.  పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠన పఠనము గాదది నెర చీఁక టింట సర కులు వెదకు రీతి ప ల్మరు వెదకినను నిర ర్థకమై పోవును వేగఁ ||పరిశుద్ధాత్మను||

2వ చరణం

2.  పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందంబే యది పరబోధక ముల వ ర్తిమైన పనులు జీ వ రహితములై యను భవము గానివై యుండుఁ ||పరిశుద్ధాత్మను||

3వ చరణం

3.  పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని నెఱుఁగు టెఱఁగుట గాదది నర రూపుఁ దాల్చి దు ర్నరుల రక్షణకొరకు మరణ మొందిన ప్రభుని కరుణాధికము వడయఁ ||పరిశుద్ధాత్మను||

4వ చరణం

4.  పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకుగాదది దురితేచ్ఛ లను గొప్ప యురులం దగిలి భక్తి తరిగి పోవుట కద్ది దొరకనందున మమ్ము ||పరిశుద్ధాత్మను||

5వ చరణం

5.  పరిశుద్ధాత్మను బొందుట అన్నిటి కన్నఁ ప్రబలంబైన మేలిట నెర నమ్మి మొఱబెట్టు పరమ పావనఁ డద్ది కరుణించి నీ కొసఁగు మరణాంత మగు దనుక ||పరిశుద్ధాత్మను||