TG-5029
Telugu

దాచబడినది దేవుని జ్ఞానం మరుగై ఉన్నది

Daachabadinadi Deevuni Jnyaanan Marugai Unnadi

0
views
పల్లవి

దాచబడినది దేవుని జ్ఞానం మరుగై ఉన్నది మహోన్నతుని చరితం (2) ఆకాశమహాకాశాలు ప్రకటిస్తుంది ఆ జ్ఞానం సంత వీధులలో కేకలు వేయుచున్నది ఆ జ్ఞానం అజ్ఞానంతో నిండిన వాళ్ళకి అర్థంకానిది ఈ జ్ఞానం ||దాచబడినది||

1వ చరణం

అదృశ్యదేవుని స్వరూపమై సర్వసృష్టి ఆధారభూతుడై అన్నిటిని చేశాడు - అంతటన ఉన్నాడు కలిగియున్నవి అన్నియు ఆయన వల్లే కలిగెనుగా జీవాన్ని నింపాడు - జీవిత గాథను నేర్పాడు (2) వినుట వలన విశ్వాసము కలుగునని పలికే ఈ జ్ఞానం చెవిగలవాడు వినునుగాకని హెచ్చరించెను ఈ జ్ఞానం (2) ||దాచబడినది||

2వ చరణం

మహిమ కలిగిన మహాదేవుడే మానవ దేహం దాల్చాడు బలహీనతలను పొందాడు - బలవంతుడై గెలిచాడు . పరలోకపు పరిశుద్ధుడే పాపులకై దిగివచ్చాడు తీవ్రత కలిగి బ్రతికాడు - తీర్పునకై నిలబడ్డాడు (2) వినుట వలన విశ్వాసము కలుగునని పలికే ఈ జ్ఞానం . చెవిగలవాడు వినునుగాకని హెచ్చరించెను ఈ జ్ఞానం (2) ||దాచబడినది||

3వ చరణం

రక్తమార్గమే రక్షణార్థమని నీతినెత్తురు ఒలికించాడు రక్త నిబంధనకై వచ్చాడు - దత్త పుత్రులను చేశాడు. వధ విధానం నేర్పినవాడే వధకై సిద్ధమయ్యాడు వంచనలేని ప్రాణాన్ని - వంచకులకై అర్పించాడు (2) వినుట వలన విశ్వాసము కలుగునని పలికే ఈ జ్ఞానం . చెవిగలవాడు వినునుగాకని హెచ్చరించెను ఈ జ్ఞానం (2) దాచబడినది మరుగై ఉన్నది ||దాచబడినది||