TG-5032
Telugu

దావీదు పురమందు రక్షకుడు పుట్టెను

Daaveedu Puramandu Rakshakudu Puttenu

21
views
పల్లవి

దావీదు పురమందు రక్షకుడు పుట్టెను నిన్ను నన్ను రక్షింప నరరూపమెత్తను పవళించే ప్రభు యేసు పశుశాలలోన పరిశుద్ధుని జన్మము నా బ్రతుకు ధన్యము ఇమ్మానుయేలుగా తోడున్నవాడు నా పాపం నీ శాపం తొలగిస్తాడు ఆల్ఫా ఒమేగా అయినవాడు యుగయుగాలు నిన్ను నన్ను పాలిస్తాడు. ఆహా ఆనందమే ఆహా ఆర్భాటమే ఓహో ఉల్లాసమే ఊహ ఉత్సాహమే ||దావీదు పురమందు||

1వ చరణం

తూర్పుదేశమందు జ్ఞానులు వచ్చిరి బంగారు భోళము సాంభ్రాని ఇచ్చిరి జ్ఞానులకు మించిన జ్ఞానుడవు రాజులకు మించిన రారాజువు నీ రాజ్యం ఇచ్చావు నీ జ్ఞానం ఇచ్చావు నీ రాజ్యం స్థాపింప నరునిగా జన్మించావు ఏలయనగా ఒక శిశువు పుట్టెను మనందరి భారము ఆయన మోసెను యెషయా మొద్దునుండి చిగురుపుట్టెను మన చీకటి బ్రతుకుమార్చి చిగురింపజేసెను ఆనాడు ప్రవక్తలు ప్రవచించిరి ఈనాడు యేసువార్త ప్రకటించుదాం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.