పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము నీ సంఘముపై
Parishuddhaathmunda, Lemmu Nee Sanghamupai
పరిశుద్ధాత్ముఁడ, లెమ్ము నీ సంఘముపై నీ వర దీవెనల నుంచుమీ చిరుత కాలపు సభ కా పరు లొంది నీ యగ్ని యరుల నెదిరించి చా టిరి నీదు సత్యంబు ||పరి||
1. బలుఁడా యీ కాలంబునన్ దివారాత్ర ములు నీదు సేవకులున్ నలు దిక్కులను దిరిగి విలసిల్లు నీ వార్త పలు జనాంగములకుఁ బ్రకటించు చుందురు ||పరి||
2. ప్రతిదేశము దిప్పుడు ఉజ్జీవముఁ బడసిరి నీ బిడ్డలు అతులుండు నీ పుత్రుఁ డాజ్ఞాపించిన యట్లే యతి తీవ్రతను వేఁడ అధిపా మాకొసఁ గుము ||పరి||
3. పరిశుద్ధాత్మ బలంబును వాక్యపు ధృతినిఁ బడసిన బోధకులను ఇరుల శక్తిని ద్రోసి నరులను నీ తట్టు మరలఁ జేసెడువారిఁ ద్వరలోఁ బంపుము దేవ ||పరి||
4. నీ యాత్మ కాంతితోడఁ బూర్వము వలెనే డాయంగ మముఁ జేయుమా యే యడ్డున్నను బాపి యెలమి నింగిని జీల్చి దాయుము మము స్వేచ్ఛ దయచేసి నీ యొద్దఁ ||పరి||
5. జను లెల్ల నీ వాక్యపు శక్తి నెఱింగి ఘనపరపఁ ద్వరచేయుము పెను సంఘములు లోక మున నాటి యిశ్రాయేల్ జనపు నిద్రను బాపు జయ మొందు నీ వాక్కు ||పరి||
6. ఇల సంఘమున నెడారుల్ కప్పుము దేవ తొలఁగించు మాటంకము అల నీ వాక్యమునకు నడ్డంబు లేమియు గలుఁగకుండఁగ నిమ్ము ఘన సంఘాధ్యక్షుండ ||పరి||
7. నీ సంఘమును నబద్ధ బోధలనుండి నిర్మలంబుగఁగావుమా గాసిఁజేసెడు జీత గాండ్లను బాపి నీ భాసిల్లు నుద్యాన వనముగ నుంచుమా ||పరి||