TG-3622
Telugu

లోకాన ఎదురు చూపుల

Lokaana Eduru Choopulu

18
views
పల్లవి

లోకాన ఎదురు చూపులు శోకాన ఎద గాయములు యేసులోన ఎదురు చూపులు ఫలియించును ప్రభు వాగ్ధానములు (2) ఎదురు చూడాలి యేసుకై నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన||

1వ చరణం

నిండు నూరేళ్లు అబ్రహాము ఎదురు చూసాడు విశ్వాసముతో (2) కన్నాడు పండంటి కుమారుని పొందాడు వాగ్ధాన పుత్రుని (2) ఎదురు చూడాలి యేసుకై నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన||

2వ చరణం

ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని ఎదురు చూసెను ఉపవాసముతో (2) చూసింది పరిశుద్ధ తనయుని సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు (2) ఎదురు చూడాలి యేసుకై నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.