లెమ్ము తేజరిల్లుము నీకు
Lemmu Thejarillumu Neeku
లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది (2) యెహోవా మహిమ నీపై ప్రకాశముగా నుదయించె (2) ||లెమ్ము||
యేసే యీ లోకమునకు వెలుగై యున్నానని చెప్పెన్ (2) యేసుని నమ్మువారు (2) వెలుగులో నడుచువారు (2) ||లెమ్ము||
అంధకార మందుండి బంధింప బడిన వారిన్ (2) ఆశ్చర్యమైన వెలుగు (2) నందించి విమోచించెన్ (2) ||లెమ్ము||
దాత ప్రభు యేసుని నమ్మి నీతిగా నడుచువారు (2) జాతి భేదములు లేక (2) జ్యోతుల వలె నుందురు (2) ||లెమ్ము||
మనుజులు మీ సత్క్రియలను జూచి బహు సంతోషించి (2) మనసారా పరమ తండ్రిన్ (2) మహిమ పరచెదరు (2) ||లెమ్ము||
జనములు నీ వెలుగునకు పరుగెత్తి వచ్చెదరు (2) రాజులు నీదు ఉదయ (2) కాంతికి వచ్చెదరు (2) ||లెమ్ము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.